ఎట్టకేలకు ప్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులు | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ప్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులు

Oct 26 2026 2:40 AM | Updated on Oct 26 2026 2:40 AM

దేవరాపల్లి: దేవరాపల్లి రెవెన్యూ పరిధిలో ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూములలో రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. దేవరాపల్లిలోని తెనుగుపూడి రోడ్డుకు ఆనుకొని ఉన్న సర్వే నెంబర్‌ 280/1, 281/1లోని 7.38 ఎకరాల మేర ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని కొన్నేళ్లుగా దర్జాగా సాగు చేసుకుంటున్నారు. ఈ ఆక్రమణలను తొలగించాలని స్థానిక సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అధికారులకు, ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తూ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సదరు భూములను ప్రభుత్వ భూములుగా గుర్తించి శనివారం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. దీనిపై సీపీఎం నేత వెంకన్న హర్షం వ్యక్తం చేశా రు. ఇక్కడే మరో సర్వే నెంబర్‌లోని 6.88 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు సంబంధించిన వాజ్యం హైకోర్టులో ఉందని, ఇది కూడా త్వరలోనే తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement