పసుపు
పెరిగిన దిగుబడితోరైతుల్లో ఆనందం
ప్రాసెసింగ్ అనంతరం పసుపుధరలు ఇలా
మాడుగుల: ఉమ్మడి విశాఖ జిల్లాలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి సాగును అరికట్టడంతో పలువురు రైతులు ప్రత్యామ్నాయంగా పసుపు సాగుపై దృష్టి సారించి, అధిక దిగుబడులు, లాభాలు పొందుతున్నారు. దీంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అల్లూరి జిల్లాలోని 11 మండలాలకు చెందిన రైతులు గంజా యి సాగును వదిలి పసుపు సాగు వైపుమళ్లారు. మూడేళ్లుగా ధరలు పెరుగుతూ వస్తుండడంతో పసుపు రైతులు ఏటా సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మన్యం ముఖద్వారమైన మాడుగుల పసుపు వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ మాడు గుల పసుపునకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులతో పాటు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి జిల్లాలోని 11 మండలాల నుంచి ఏటా 1.50 లక్షల బస్తాల పసుపు కొమ్ములను మాడుగులకు తరలించి, ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తున్నారు. గత ఏడాది కిలో పసుపు ధర రూ.150 ఉండగా, ఈ ఏడాది రూ.170కి పెరిగింది. ఏటా సుమారు రూ.209 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. ఈ ప్రాసెసింగ్ కేంద్రాల ద్వారా 1,100 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి.
పెరుగుతున్న సాగు విస్తీర్ణం
గతంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో పసుపు సాగు సుమారు 16 వేల హెక్టార్లకు విస్తరించింది. ఏజెన్సీ నుంచి సుమారు 1,50,000 బస్తాల పసుపు (బస్తాకు 77 కిలోలు) మాడుగులకు చేరుతుంది.
గంజాయికిప్రత్యామ్నాయంగా సాగు
మాడుగులలో ఊపందుకున్న ప్రాసెసింగ్
మాడుగుల నుంచి మద్రాసుకు 80 శాతం ఎగుమతులు
పసుపు ప్రాసెసింగ్ ఇలా...
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండించిన పసుపు దుంపలను మాడుగులకు తరలించి డ్రమ్ముల్లో ఉడకబెట్టి 10 కేంద్రాల ద్వారా ప్రాసెసింగ్ చేస్తారు. అనంతరం గ్రేడింగ్ చేసి మేలిమి పసుపు, నార పసుపులుగా విడివిడిగా ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేస్తారు. తర్వాత చైన్నె, బరంపురం, కొచ్చిన్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. పంట పండించే దగ్గర నుంచి ఎగుమతి చేసే వరకు ఏడాది పొడవునా, ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,100 మందికి పైగా కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి.


