వైఎస్సార్‌సీపీలో పలువురి చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో పలువురి చేరిక

Sep 21 2026 12:56 AM | Updated on Sep 21 2026 12:56 AM

బుచ్చెయ్యపేట: మండలంలోని పి.పి.ఆగ్రహారం శివారు ఉప్పరగూడెంకు చెందిన 50 మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆ పార్టీలను వీడి ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి కొళ్లిమల్ల అచ్చింనాయుడు, ఎంపీటీసీ గోకివాడ రాము, తాజా మాజీ సర్పంచ్‌ కురందాసు కోటేశ్వరరావు, గ్రామ నాయకుడు గణేష్‌ ఆధ్వర్యంలో రీజనల్‌ కో ఆర్డినేటర్‌, వైఎస్సార్‌సీపీ చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి గుడివాడ అమర్‌నాఽఽథ్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కురందాసు అప్పలనాయుడు, నక్కా బంగారు కృష్ణ, గుర్రం అప్పలనాయుడు, కృష్ణారావు, వెంకటేష్‌, పోతునాజు, వరహారావు, నక్కా భద్రాచలం, గుర్రం నూకరాజు, కురం కృష్ణ, గుర్రం సాయికృష్ణ, రామ్‌చరణ్‌ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరందరికి అమర్‌నాఽథ్‌ పార్టీ కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రీజనల్‌ కో ఆర్డినేటర్‌ అమర్‌నాఽథ్‌ల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని వారు తెలిపారు. జెడ్పీటీసీ దొండా రాంబాబు, పార్టీ మండల అధ్యక్షుడు జోగా కొండబాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ కోవెల జనార్ధనరావు, వైస్‌ ఎంపీపీ గొంపా చినబాబు, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు సాయం రమేష్‌ తదితర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement