దసరా ఉత్సవ కమిటీ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

దసరా ఉత్సవ కమిటీ ఏర్పాటు

Sep 21 2026 12:56 AM | Updated on Sep 21 2026 12:56 AM

సాక్షి, పాడేరు: పట్టణంలోని మెయిన్‌ బజార్‌ పాత ఆసుపత్రి సెంటర్‌లో దసరా ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 16 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ దసరా ఉత్సవాలకు సంబంధించి నూతన ఉత్సవ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జానపద కళలు–సాంస్కృతిక విభాగం చైర్మన్‌ వి. గంగులయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి, సలహాదారుగా పి. గోవిందరావు వ్యవహరించనున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా వెయ్యాకుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులుగా బుద్దా జ్యోతికిరణ్‌, యాదగిరి శ్రీను ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా గంగపూజారి శివకుమార్‌, బోనంగి వెంకటరమణ, బిమ్మలపూజారి ఈశ్వరరావు, పూసర్ల గోపి, కూడి వలసంనాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. కార్యదర్శులుగా నవర మోదకొండబాబు, కూడి నాయుడు, సున్నం లక్ష్మణ్‌, వర్తన నీలకంఠం, సమిరెడ్డి తిరుపతిరావులను, కోశాధికారులుగా బూరెడ్డి రామునాయుడు, పచ్చా రవీంద్రలను ఎన్నుకున్నారు. వీరితో పాటు సహాయ కార్యదర్శులు, సభ్యులుగా మరికొంతమందిని కమిటీలోకి ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement