గ్రావెల్‌ ట్రాక్టర్‌, పొక్లెయిన్‌ స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

గ్రావెల్‌ ట్రాక్టర్‌, పొక్లెయిన్‌ స్వాధీనం

Sep 21 2026 12:56 AM | Updated on Sep 21 2026 12:56 AM

కోటవురట్ల: చినబొడ్డేపల్లి శివారు రెడ్డి కొత్తూరులో కొండపై అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు చేస్తుండగా పోలీసులు దాడి చేశారు. పొక్లెయిన్‌, గ్రావెల్‌ లోడు ట్రాక్టరును పట్టుకున్నారు. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాలివి.. కొండపై అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారన్న సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశారు. ట్రాక్టరులో గ్రావెల్‌ను లోడింగ్‌ చేస్తుండగా పొక్లెయిన్‌, ట్రాక్టరును స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడతామని ఎస్‌ఐ తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఇసుక, గ్రావెల్‌, రాయిని తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement