అనకాపల్లి: కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో విద్యార్థులపై దాడులు జరపడం అమానుషమని, ఈ దమనకాండను దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారని అనకాపల్లి బార్ అసోసియేషన్ కార్యదర్శి శివాచారి అన్నారు. దాడులకు వ్యతిరేకంగా స్థానిక కోర్టు భవనాల సముదాయం వద్ద శుక్రవారం న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్, కేంద్ర ప్రభుత్వ తప్పిదాల కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు నష్టపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పూర్వ కార్యదర్శి ఆడారి స్వామి, పూర్వ అధ్యక్షుడు బుద్ధ త్రినాథ్, శేఖరమంత్రుల సాయి వెంకట లక్ష్మణ్, న్యాయవాదులు పాల్గొన్నారు.


