కలెక్టర్ విజయ కృష్ణన్
రావికమతం: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి సమాజ శ్రేయస్సుకు పాటు పడాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. మరుపాక మోడల్ స్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన పేరెంట్, టీచర్ మీటింగ్‌లో విజయ్ కృష్ణన్, స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల మానసిక స్థితిని తల్లిదండ్రులు గమనించి, వారితో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. ఈ సందర్భంగా కొందరు తల్లిదండ్రులు మాట్లాడుతూ నర్సీపట్నం నుంచి నేరుగా మరుపాక మోడల్ స్కూల్ వరకు బస్సులు నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు, మండల ప్రత్యేక అధికారి విజయప్రసాద్, తహసీల్దార్ అంబేడ్కర్, ఎంపీడీవో మహేష్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండనాయుడు, కొత్తకోట సీఐ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


