చోడవరం: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసంచేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలులో పెడతారా అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, చోడవరం సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. జగన్ 2.0 యాప్ వాల్‌పోస్టర్‌ను చోడవరం పార్టీ కార్యాలయంలో ఆయన శుక్ర వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ అరాచకాలను యాప్‌లో నమోదు చేయవచ్చని చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. కూటమి నాయకులు ఎక్కడికక్కడ కొండలు, భూములు, ఇసుక, మట్టి దోపిడీ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని, అటువంటి బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజలు భయపడరని చెప్పారు. ప్రతి ఒక్కరూ జగన్ 2.0 యాప్‌ను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొండారాంబాబు, ఎంపీపీ గాడి కాసు, జిల్లా యూత్, రైతు విభాగాల అధ్యక్షులు పుల్లేటి వెంకటేష్, నాగులాపల్లి రాంబాబు, మండల అధ్యక్షుడు శరగడం చిమ్మినాయుడు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గూనూరు రామచంద్రనాయుడు, సోషల్‌మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పందిరి శ్రీనివాసరావు, చోడవరం పట్టణశాఖ అధ్యక్షుడు దేవరపల్లి సత్య, చోడవరం వైస్ ప్రెసిడెంట్ పుల్లేటి వెంకట్రావు, బొగ్గు శ్యామల, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శులు దొడ్డి వెంకట్రావు, ఓరుగంటి నెహ్రూ, ఎస్సీసెల్ రాష్ట్రసంయుక్త కార్యదర్శి వేచలపు ప్రకాష్, బొగ్గు శ్యామల తదితరులు పాల్గొన్నారు.
గుడివాడ అమర్‌నాథ్


