నేడు మారు రథయాత్ర | - | Sakshi
Sakshi News home page

నేడు మారు రథయాత్ర

Jul 25 2026 12:29 AM | Updated on Jul 25 2026 12:29 AM

అనకాపల్లి టౌన్‌: జగన్నాథ స్వామి మారు రథయాత్ర మహోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించనున్నారు. దేవదాయశాఖాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక గూడ్స్‌రోడ్డు ఇంద్రద్యుమ్న హాల్‌ నుంచి ఉదయం 9 గంటలకు మారు రథయాత్ర ప్రారంభమవుతుందని ఆలయ ఈవో కె.చంద్రతేజ తెలిపారు. మళ్ళవీధి, గాంధీబొమ్మ జంక్షన్‌, పెరుగుబజార్‌, చిననాలుగురోడ్ల జంక్షన్‌, మెయిన్‌ రోడ్డు మీదుగా వేల్పులవీధి, పెద నాలుగురోడ్ల జంక్షన్‌ శారదాబ్రిడ్జి వరకు వెళ్లి తిరిగి పెద నాలుగు రోడ్ల జంక్షన్‌, వన్‌వేట్రాఫిక్‌ డౌన్‌ మీదుగా రథం గవరపాలెం అగ్గిమర్రిచెట్టు వద్ద ఉన్న జగన్నాథస్వామి ఆలయానికి చేరుకుంటుంది. ఈసందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement