మండలాల్లో అందుబాటులో
ఉండని 108 వాహనాలు
రిఫరల్ కేసులతో బిజీ
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి నుంచి విశాఖకు రోగుల తరలింపు ?
కదలని ఏరియా ఆస్పత్రిలోని
అంబులెన్స్‌లు ?
ప్రమాదాల సమయంలో
క్షతగాత్రులకు తప్పని ఇబ్బందులు
ప్రైవేటు వాహనాలను
ఆశ్రయిస్తున్న రోగులు
సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నం, మాకవరపాలెం, కోటవురట్ల, రోలుగుంట, రావికమతం, గొలుగొండ మండలాల పరిధిలో రోడ్డు ప్రమాదాలు, అత్యవసర సమయాల్లో ఆదుకోవాల్సిన 108 అంబులెన్స్‌ల సేవలు సకాలంలో అందడం లేదు. ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి సకాలంలో చేర్చే ఉద్దేశంతో 108 అంబులెన్స్ వాహనాలకు శ్రీకారం చుట్టారు. కానీ నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి, కేజీహెచ్‌లకు రిఫరల్ కేసులకు వాటిని తరలిస్తూ నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్ సక్రమంగా వినియోగించకపోవడంతో ఈపరిస్థితి ఏర్పడు తోంది.
రోజూ విశాఖకు ఐదు వాహనాలు ?
నర్సీపట్నం డివిజన్ పరిధిలోని 12 మండలాలుండగా వీటిలో మండలానికి ఒకటి చొప్పున 108 వాహనాలున్నాయి. ఈ మండలాల పరిధిలో ఎక్కడ ప్రమాదాలు జరిగినా క్షతగాత్రులకు, ప్రసవ సమయంలో గర్భిణులకు అత్యవసర సేవలు అందించాల్సిఉంది. కానీ నర్సీప ట్నం, మాకవరపాలెం,గొలుగొండ, నాతవరం, రోలుగుంట, రావికమతం, కోటవురట్ల మండలాలకు చెందిన నాలుగు నుంచి ఐదు వాహనాలు రోజూ విశాఖకు రిఫరల్ కేసులపై వెళ్తున్నాయని సమాచారం. ఈ మండలాల 108 వాహనాలు స్థానికంగా అందుబాటులో ఉండకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఒకే సారి పలు ప్రమాదాలు జరిగితే ..
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి నుంచి కేజీహెచ్, అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రులకు రిఫర్ కేసులు పంపడం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్‌లను ఉపయోగించడం లేదు. లాంగ్ రిఫరల్ కేసులన్నీ 108 అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. దీంతో 108 అంబులెన్స్ వాహనాలు అందుబాటులో ఉండడం లేదు. ఒకే సమయంలో పలు ప్రమాదాలు సంభవించే సమయంలో స్థానికంగా ఎమర్జెన్సీ కేసులు తీసుకొచ్చేందుకు ఒక్కటైనా 108 అంబులెన్స్‌ఉండేలా చూసుకోవాలి. కానీ ఆస్పత్రి అధికారుల తీరు వల్ల 108 వాహనాలు అందుబాటులో ఉండడం లేదు. 108 వాహనాలు ప్రతి మండల కేంద్రంలో అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డివిజన్ పరిధిలోని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికంగా
అందుబాటులో ఉంచాలి
108వాహనాన్ని ఎప్పుడూ స్థానికంగానే అందుబాటులో ఉంచాలి. ఈ వాహనాలు అందుబా టులో లేకపోవడం వల్లే ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. అంబులెన్స్ రాకపోవడంతో రెండు రోజుల క్రితం జరి గిన ప్రమాదంలో గాయపడిన మాఊరి యువ కుడు దొరను బైక్‌పైనే నర్సీపట్నం తరలించాల్సి వచ్చింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే 108 వాహనం స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
– పిల్లా బాబూరావు,
బీజేపీ మండల కార్యదర్శి,
మాకవరపాలెం
అధికారులు
స్పందించాలి
ప్రజలకు 108 వాహనం అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. డివిజన్ పరిధిలోని మండలాల్లో 108 వాహనాలు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవస ర సమయాల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీనిని నివారించేలా అధికారులు చర్యలు చేపట్టాలి.
– ఈరెల్లి చిరంజీవి, సీపీఎం నాయకుడు, నర్సీపట్నం డివిజన్
రిఫరల్‌కు ఉపయోగించని ఏరియా ఆస్పత్రి వాహనాలు
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో మాజీ ఎంపీలు సత్యవతి, సుబ్బిరామిరెడ్డిలతో పాటు ఒక ఫార్మా కంపెనీ విరాళంగా ఇచ్చిన మూడు అంబులెన్‌్స్ వాహనాలు అందుబాటులో ఉన్నా యి. ఏరియా ఆస్పత్రి నుంచి విశాఖకు రోగులను తరలించేందుకు ఈ వాహనాలను ఉపయోగించాల్సి ఉండగా, అధికారులు వాటిని మూలన పడేశారు.ఏరియా ఆస్పత్రి అంబులెన్స్‌లను వాడకపోవడానికి డీజిల్ ఖర్చులు భరించలేకపోవడం, నిర్వహణ సరిగ్గా లేకపోవడమే కారణాలని తెలుస్తోంది. కొన్నిసార్లు డీజిల్, నిర్వహణ చార్జీలను రోగుల నుంచే వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ భారాన్ని తప్పించుకునేందుకు ఏరియా ఆస్పత్రి యాజమాన్యం రిఫరల్ కేసులన్నింటినీ 108 వాహనాలపైకి నెట్టేస్తోందని సమాచారం.


