నర్సీపట్నం: వెలుగులో పనిచేస్తున్న వీవోఏలకు కనీస వేతనంగా రూ.26 వేలు చెల్లించాలని సీఐటీయూ నాయకుడు ఈరెల్లి చిరంజీవి డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వీవోఏల డివిజన్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30 వేల మంది వీవోఏలు పనిచేస్తున్నారని, వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారన్నారు. వీవోఏల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, అక్రమ తొలగింపులు ఆపాలని, పనిభారం తగ్గించాలని, రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాళ్ల రాజబాబు, కిల్లాడ నరసింహారావు, గొర్ల జ్యోతి, తిరునారు పాల్గొన్నారు.


