సంక్షేమ పాలన వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పాలన వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం

Mar 6 2026 8:32 AM | Updated on Mar 6 2026 8:32 AM

● చంద్రబాబు ప్రభుత్వ పాలనపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌

మునగపాక: సంక్షేమంతో పాటు సుపరిపాలన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ అన్నారు.అమలు కాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ప్రజలంతా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. తనకు మూడవ పర్యాయం వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన జగన్‌మోహన్‌రెడ్డికి ప్రసాద్‌ కృతజ్ఞతలు తెలిపారు.స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. అమలుకాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు విసుగు చెందుతున్నారని తెలిపారు. వేంకటేశ్వర స్వామిపై కూడా చంద్రబాబు ప్రభుత్వం రాజకీయం చేస్తూ, కోట్లాది మంది భక్తుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని చెప్పారు. తనపై జగన్‌మోహనరెడ్డి ఉంచిన నమ్మకాని వమ్ము చేయకుండా మాజీ మంత్రులు గుడివాడ అమర్‌నాఽథ్‌,బూడి ముత్యాలనాయుడు,మాజీ విప్‌ కరణం ధర్మశ్రీలతో పాటు ఇతర సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్‌ ఆడారి అచ్చియ్యనాయుడు,జెడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ,మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు శీరా రమణమ్మ, సర్పంచ్‌లు దిమ్మల అప్పారావు,బొడ్డేడ శ్రీనివాసరావు, ఇందల నాయుడు,భీశెట్టి గంగప్పలనాయుడు, పెదబ్బాయి,సుందరపు తాతాజీ, ఎంపీటీసీలు మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు, సూరిశెట్టి రాము, మద్దాల వీరునాయుడు,బొడ్డేడ బుజ్జి, కాండ్రేగుల కిరణ్‌కుమార్‌, ఇల్లా నాగేశ్వరరావు,మళ్ల కాశీ సురేష్‌, పార్టీ నేతలు పిట్టా మంగారెడ్డి, పిన్నమరాజు రవీంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement