చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
రోలుగుంట: చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రజల్లోకి తెసుకువెళ్లాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీలు వైఎస్సార్‌సీపీ నాయకులకు సూచించారు. మండలం కేంద్రం రోలుగుంటలో నిర్వహిస్తున్న గౌరీపరమేశ్వర ఉత్సవాల్లో వారు శుక్రవారం పాల్గొని, ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. అనంతరం జెడ్పీటీసీ పోతల లక్ష్మీ రమణమ్మ ఇంటిలో ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు, బీసీ సెల్ రాష్ట్ర ప్రతినిధి పోతల లక్షీశ్రీనివాసరావు, పార్టీ నాయకులు పోతల రాజశేఖర్, ఎంపీటీసీ వడ్డాది సతీష్, మాజీ సర్పంచ్‌లు బంటుసూర్య సన్యాసి దేముళ్లు, పరవాడ చిన్ని, స్థానిక మాజీ ఉప సర్పంచ్ తాతబాబు, యువ కార్యకర్తలు మడ్డు శివ, పిల్లి శ్రీను, కాళ్ల నాయుడు మహిళా విభాగం యువ కార్యకర్త దీప్తి తదితరులు పాల్గొన్నారు.


