వలస కూలీ ఇంట్లో చోరీ
● తురకపూడిలో ఘటన
ఇంటిని పరిశీలిస్తున్న ఎస్‌ఐ శ్రీనివాస్
బుచ్చెయ్యపేట: మండలంలో తురకపూడి గ్రామంలో వలస కూలీ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. గ్రామానికి చెఽందిన తోకల రాము పొట్టకూటి కోసం చైన్నె వెళ్లి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం తన ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉంది. రాము ఇంటి లోపలికి వెళ్లి చూడగా, బీరువాలో దాచుకున్న 2 తులాల బంగారు తాడు, 30 తులాల వెండి పట్టీలు చోరీ అయినట్లు గుర్తించాడు. దీనిపై బుచ్చెయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో విచారణ చేపట్టారు.


