రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
అచ్యుతాపురం రూరల్ : గుంటూరులో జరిగే మినీ సబ్ జూనియర్ బాల బాలికల రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు జిల్లా జట్లను శుక్రవారం ఎంపిక చేశారు. భోగాపురం క్రీడా ప్రాంగణంలో శుక్రవారం జరిగిన ఎంపిక పోటీలకు జిల్లాలో పలు పాఠశాలలు, వివిధ స్పోర్ట్స్ క్లబ్‌ల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీల్లో బాలుర విభాగంలో చౌడువాడ హైస్కూల్, అనకాపల్లి సిద్ధార్థ ఈ టెక్నో స్కూల్, ఎంజే పురం హైస్కూల్ విద్యార్థులు వరుసగా ప్రథమ, దిత్వీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో చౌడువాడ హై స్కూల్, ఎంజేపురం హైస్కూల్, అచ్యుతాపురం కై ట్స్ విద్యా విహార్ విద్యార్థినులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారు. జట్టుకు 12 మంది చొప్పున ఎంపికై న 24 మంది క్రీడాకారులు ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో పాల్గొంటారని నేషనల్ కోచ్ వెంకట్ తెలిపారు. క్రీడాకారులను జిల్లా రగ్బీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కూండ్రపు వెంకునాయుడు, అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎన్.వి. జగదీష్, సెక్రటరీ డాక్టర్ వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి గణేష్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ అడిగర్ల సుధీర్, కోశాధికారి కూండ్రపు రమేష్ తదితరులు అభినందించారు.


