
కోనాంలోకి భారీగా ఇన్‌ఫ్లో
చీడికాడ: కోనాం జలాశయంలోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరడంతో జలాశయం నీటిమట్టం ఒక్కసారిగా పెరుగుతోంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు జలాశయం ఎగువన కురిసిన అల్పపీడన వర్షాలతో ఆదివారం వరకు 160 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి 960 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో జలాశయం నీటిమట్టం ఒక్కసారిగా పెరిగి మంగళవారం సాయంత్రానికి 99.05 మీటర్లకు చేరుకుంది. ప్రమాదస్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా 100 మీటర్లకు చేరుకోగానే నీటి విడుదలను పెంచనున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దిగువకు 130 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు.