
పార్వతీ తనయా.. నీకు మొక్కెదన్
ఇరుకు రోడ్లపై అధిక లోడుతో క్వారీ వాహనాల రాకపోకలు
సందట్లో సడేమియాలా మామూళ్లలో వాటా కోసం ‘కూటమి’ ప్రజాప్రతినిధుల పాకులాట
సాక్షి, అనకాపల్లి: తొలి పూజలందుకునే ఆదిదేవుడు.. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన పార్వతీ తనయుడు విఘ్నేశ్వరుడు. వినాయక చవితి వచ్చిందంటే ఊరూరా ఒకటే సందడి. ఇళ్లలో పూజలు.. వీధుల్లో మండపాలు.. వివిధ రూపాల్లో వినాయక ప్రతిమలు.. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా తొమ్మిది రోజులపాటు సాగే సంబరమిది. ఈ ఏడాది ఘనంగా గణపతి నవరాత్రులు నిర్వహించేందుకు జిల్లా అంతటా విస్తృత ఏర్పాట్లు చేశారు. చోడవరంలో స్వయంభూ విఘ్నేశ్వరుడి ఆలయం, నక్కపల్లి మండలంలో ఒడ్డిమెట్ట లక్ష్మీ గణపతి గుడి, అనకాపల్లిలో చింతామణి గణపతి దత్త క్షేత్రం జిల్లాలో ప్రసిద్ధమైన ఆలయాలు. ఇక్కడ జరిగే వేడుకలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వినాయక పందిళ్లలో నెలకొనే సందడి అంతా ఇంతా కాదు. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో 126 అడుగుల వినాయక విగ్రహం, వేల్పుల వీధిలో 30 అడుగుల వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వెయ్యికి పైగా గణేష్ మండపాల ఏర్పాటుకు పోలీసుల నుంచి నిర్వాహకులు అనుమతులు పొందారు. గణేష్ ఉత్సవాలను ఎటువంటి అల్లర్లు, ఘర్షణలకు తావు లేకుండా శాంతియుతంగా నిర్వహించుకునేందుకు పోలీసు శాఖకు ప్రజలందరూ సహకరించాలని ఎస్పీ తుహిన్ సిన్హా కోరారు. ఉత్సవాల నిర్వహణలో అల్లర్లకు కమిటీలదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు, రికార్డింగు డాన్సులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు.
టిప్పర్లతో తిప్పలు

పార్వతీ తనయా.. నీకు మొక్కెదన్

పార్వతీ తనయా.. నీకు మొక్కెదన్