
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి
అచ్యుతాపురం రూరల్: కుమారపురం గ్రామానికి చెందిన రెడ్డి మాధురి (25) రాయ్‌పూర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెడ్డి మాధురి అంగన్‌వాడీ కార్యకర్తగా కుమారపురంలో విధులు నిర్వహిస్తుంది. గత జూన్ 26న అచ్యుతాపురం కూడలికి సమీపంలో పిరమిడ్ వాటర్ ప్లాంట్ దగ్గర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైందన్నారు. విశాఖ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో నెల రోజులు చికిత్స పొంది అనంతరం మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించామన్నారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్టు సీఐ నమ్మి గణేష్ తెలిపారు. మృతురాలు ప్రమాదం జరిగిన సమయంలో గర్భిణి, చికిత్స సమయంలో నెలలు నిండడంతో ఆపరేషన్ చేసి మగ శిశువుకు జన్మనివ్వగా రెండు రోజుల వ్యవధిలో ఆ పసిపిల్లడు కూడా మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.