
వంద శాతం వైకల్యం ఉంటే రూ.15 వేలు పింఛను
ఎస్.రాయవరం: వందశాతం వికలత్వం ఉన్నవారికి రూ.15 వేలు వికలాంగ పింఛను అందజేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హైమావతి అన్నారు. సర్వసిద్ది గ్రామాన్ని మంగళవారం డీఎంఅండ్‌హెచ్‌వో అకస్మికంగా తనిఖీ చేశారు. సర్వసిద్ది గ్రామానికి చెందిన కందలాడ రాజు పుట్టినప్పటి నుంచి మంచానికి పరిమితం అయినప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేలు ఇవ్వడం లేదని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి నేరుగా బాధిగుడి వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. దివ్యాంగుడికి రూ.15 వేలు పింఛనుకు అర్హుడని, త్వరలో మంజూరు అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో పర్యటించి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. డీఎంఅండ్‌హెచ్‌వో వెంట సర్వసిద్ధి పీహెచ్‌సీ వైద్యాధికారి వాసంతి, సిబ్బంది నాగేశ్వరరావు పాల్గొన్నారు.