
రెండు కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు
కె.కోటపాడు: రెండు కిలోల గంజాయిని బైక్‌పై తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులను కె.కోటపాడు ఎస్‌ఐ ఆర్.ధనుంజయ్ మంగళవారం పట్టుకున్నారు. కె.కోటపాడులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అటుగా బైక్‌పై అనుమానస్పదంగా ప్రయాణిస్తున్న ఇద్దరి వ్యక్తులను పట్టుకున్నారు. వీరు పోలీసుల నుంచి పారి పోయేందుకు యత్నించగా సిబ్బందితో కలిసి ఎస్‌ఐ ధనుంజయ్ పట్టుకున్నారు. వారు కాకినాడ జిల్లాకు చెందిన చెక్క దుర్గా ప్రసాద్, వనుమూడి జానకిరామ్‌గా పోలీసులు తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ ట్యాంక్ కవర్‌లో కిలో గంజాయితో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి బ్యాగ్‌లో మరో కిలో గంజాయిని పోలీసులు గుర్తించారు. అరకు ఏజెన్సీ ప్రాంతం నుంచి వారు గంజాయిని కొనుగోలు చేసి తెస్తున్నట్టు తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న పల్సర్ బైక్ దొంగిలించబడిందని, దీనిపై డుంబ్రిగుడ పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదై ఉందని ఎస్‌ఐ ధనుంజయ్ తెలిపారు. నిందితుల నుంచి బైక్, గంజాయి, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.