
ఎస్పీ కార్యాలయానికి 46 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 46 అర్జీలు వచ్చాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి పలువురు అర్జీదారులు తమ సమస్యలపై ఎస్పీ తుహిన్‌సిన్హాకు విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భూ తగాదాలు –20, కుటుంబ కలహాలు –3, మోసపూరిత హామీలపై ఫిర్యాదులు– 4, ఇతర విభాగాలకు చెందినవి –19 అర్జీలు వచ్చాయని పేర్కొన్నారు. చట్టపరిధిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కిందస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్‌ఐ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.