
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ : క్లీనర్ మృతి
నక్కపల్లి: జాతీయ రహదారిపై గొడిచర్ల కొత్తూరు సమీపంలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో క్లీనర్ మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. రాజమహేంద్రవరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ టైరు పంక్చర్ అయింది. దాంతో రోడ్డు పక్కన నిలిపి టైరు మారుస్తుండగా, వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనుక లారీలో ఉన్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన క్లీనర్ ప్రదీప్ రామ్‌నాయక్(55) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెనుక నుంచి ఢీకొట్టిన లారీ ముందుభాగం నుజ్జయింది.