
వీవోఏ సంఘం జిల్లా అధ్యక్షురాలిగా రూపాదేవి
అనకాపల్లి:
ఏపీ వీవోఏ( వెలుగు యానిమేటర్లు) సంఘం జిల్లా అధ్యక్షురాలిగా సీహెచ్.రూపాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్.వెంకటలక్ష్మి, జిల్లా గౌరవాధ్యక్షుడిగా వి.వి.శ్రీనివాసరావు, కోశాధికారిగా సిహెచ్.ఎల్.ఎన్. రాజేష్, జిల్లా కార్యదర్శులుగా కె. కనకలక్ష్మి (కోటవురట్ల), ఎం రాజ్యలక్ష్మి(నర్సీపట్నం), జి. సత్యవతి (రావికమతం), అప్పలనాయుడు(చీడికాడ), భవాని (కశింకోట), ఉష (మునగపాక), కె.సూరిబాబు (దేవరాపల్లి), లావణ్య (అచ్యుతాపురం), క్రాంతి (నాతవరం), రాము (అనకాపల్లి), మరో 25 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు రూపాదేవి మాట్లాడుతూ పై కమిటీ ఎన్నిక రెండు సంవత్సరాలు ఉంటుందన్నారు. వీవోఏలకు గుదిబండగా ఉన్న మూడు సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దుతోపాటు హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, కనీస వేతనాలు, గ్రూపు ఇన్సూరెన్స్, యూనిఫాం, ఐడీ కార్డులు తదితర సమస్యలపై భవిష్యత్తు పోరాటాలకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.