
స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
గొలుగొండ: జోగుంపేట జంక్షన్ వద్ద స్కూల్‌బస్సుకు ప్రమాదం తప్పింది. నర్సీపట్నంలోని నలంద స్కూల్ బస్ బుధవారం ఉదయం 8 గంటలకు జోగుంపేట కాలనీకి వెళుతున్న సమయంలో జోగుంపేట జంక్షన్ వద్ద స్టీరింగ్ అదుపు తప్పింది. ఈ సమయంలో బస్‌లో 55 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. జోగుంపేట మలుపు వద్ద ప్రమాదం జరగడంతో ఎటువంటి నష్టం జరగలేదు. అదే రోడ్డుపై స్టీరింగ్ అదుపు తప్పితే పెద్ద ముప్పే ఎదురయ్యేది. కృష్ణదేవిపేట–నర్సీపట్నంలో తిరిగే బస్సులు పాతవి కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. వీటిపై రవాణాశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.