
చెరువులో కాలుజారి రైతు మృతి
చీడికాడ : చెరువులోకి దిగుతున్న పశువులను బయటకు మళ్లించబోయి కాలుజారి చెరువులో పడి రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని ఖండివరంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఎస్‌ఐ బి.సతీష్ అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామాని చెందిన ఈర్లె రామునాయుడు(50) గురువారం మధ్యాహ్నం తమ పశువులను మేతకు తోలుకెళ్లాడు. గ్రామ సమీపంలో గల పెద్ద చెరువులోకి పశువులు దిగేందుకు ప్రయత్నించగా వాటిని ఆపే దిశగా రామునాయుడు ప్రయత్నించగా కాలుజారి చెరువులో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందాడు. ఈ దుర్ఘటనపై మృతుడు భార్య ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవపంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్టు ఎస్‌ఐ చెప్పారు.