
400 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ
చౌడువాడలో 400 అడుగుల జాతీయ జెండాతో హర్‌ఘర్ తిరంగా కార్యక్రమం
హర్‌ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు
కె.కోటపాడు : చౌడువాడ పంచాయతీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. 400 అడుగుల జాతీయ జెండాతో హైస్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీ చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రోడ్డు మార్గంలో భారీ జాతీయ జెండాతో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాడి ఎరుకునాయుడు, వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ, ఎంపీటీసీ ఏటుకూరి రాజేష్, పంచాయతీ కార్యదర్శి బి.సురేష్‌బాబు, విశాఖ డెయిరీ డైరెక్టర్ ఏటుకూరి రాజేష్ పాల్గొన్నారు.
దేవరాపల్లి: తెనుగుపూడి డా. బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల విద్యాలయం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 100 మీటర్ల జాతీయ జెండాతో గురువారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక గురుకుల విద్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని ప్రిన్సిపాల్ ఎస్.విక్టర్‌పాల్ జాతీయ జెండా ఊపీ ప్రారంభించారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, సిబ్బంది భారతమాతాకి జై, మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ ర్యాలీని నిర్వహించామని ప్రిన్సిపాల్ తెలిపారు.
కలెక్టరేట్‌లో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు
తుమ్మపాల : 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయం విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబు చేశారు. మువ్వన్నెల రంగుల కాంతుల వెలుగులో కార్యాలయ భవనం గురువారం రాత్రి మరింత అందంగా కనిపించింది. శుక్రవారం పంద్రాగస్టు వేడుకలకు జిల్లా యంత్రాంగా ఏర్పాట్లు చేసింది. హోంమంత్రి అనిత కలెక్టరేట్‌లో జెండావిష్కరణ చేయనున్నారు.

400 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ