
ఇదీ నేపథ్యం..!
పరవాడ మండలం దేశపాత్రునిపాలెం పరిధిలోని 360–1, 360–2, 360–3, 360–2 సర్వే నెంబర్లలో మొత్తం 13.25 ఎకరాల భూమిని నలుగురు మాజీ సైనికోద్యోగులకు (రమణమ్మ, ఎస్.వేణుగోపాల్ రెడ్డి, ఏఎస్‌ఆర్‌కే కుమార్, ఆర్.రామచంద్రరావు) కేటాయించారంటూ రికార్డుల్లో ఉంది. ఈ భూములను వారి నుంచి గతంలోనే కోరమాండల్ ఎస్టేట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కొనుగోలు చేసింది. అప్పట్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు భూ వివాదాలు నడుస్తున్నాయని.. భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ మంత్రి అయ్యన్న ఆరోపించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసి విచారణ కూడా నిర్వహించారు. దీంతో గతంలో జరిగిన భూలావాదేవీలపై నిషేధం విధించారు. ప్రధానంగా మాజీ సైనికోద్యోగులకు చెందిన భూములపై లావాదేవీలు జరగకుండా నిషేధం కొనసాగింది. ఈ నేపథ్యంలో దేశపాత్రునిపాలెం పరిధిలోని 13.25 ఎకరాల భూముల లావాదేవీలపై కూడా నిషేధం ఉంది. ఇప్పుడు హఠాత్తుగా సిట్‌లో 360–1, 360–2 సర్వే నెంబర్లు లేవని అపెక్స్ కమిటీ మెమోను చూపిస్తూ ప్రైవేటు సంస్థకు 6.26 ఎకరాల భూమిని కట్టబెట్టడం గమనార్హం.