
ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
అనకాపల్లి డిపో గ్యారేజి గేటు వద్ద ధర్నా చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు
అనకాపల్లి: ప్రజారవాణా శాఖ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రీజనల్ కార్యదర్శి పి.సుధాకర్, డిపో అధ్యక్షుడు ఎ.ఎం.రావులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు స్థానిక డిపో గ్యారేజీ గేటు వద్ద మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బుధవారం ధర్నా చేపట్టారు. విశ్రాంత ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని, గ్యారేజీ ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవు మంజూరు చేయాలని, అనారోగ్య సెలవులకు పూర్తిగా జీతం చెల్లించాలని, ఈహెచ్‌ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థపరంగా వేతనాలు చెల్లించాలని, తీవ్రమైన అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఉద్యోగులకు ఓడీలను కేటాయించాలని తదిత ర డిమాండ్లతో ధర్నా చేపట్టారు. డిపో కార్యద ర్శి కె.ఎన్.వి.రమేష్, కోశాధికారి ఎం.బి.రాజు, నాయకులు కె.ఎన్.భూషణం, పి.వి.ఆర్.మూర్తి, బి.ఆర్.ఎ.రావు, తదితరులు పాల్గొన్నారు.