
విద్యార్థులు ఆరోగ్య సూత్రాలు పాటించాలి
ఎస్.రాయవరం : విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ధేశించుకుని చదివితే మంచి ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. జాతీయ నులిపురుగులు దినోత్సవం పురస్కరించుకుని లింగరాజుపాలెం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. విద్యార్థులకు నులిపురుగులు మాత్రలు పంపిణీ చేసి వారితో ముచ్చటించారు. విద్యార్థులకు చదువుతో పాటు పరిశుభ్రతపై కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. చేతి గోళ్లు కత్తిరించి శుభ్రంగా ఉంచుకునేలా చేయాలన్నారు. పాఠశాలల్లో పరిశుభ్రమైన తాగునీటిని అందించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. మరుగుదొడ్డి వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలతో పాటు విద్యాలక్ష్యాలను కూడా వివరించాలని సూచించా రు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హైమావతి, డీఈవో అప్పారావు, సర్వసిద్ధి పీహెచ్‌సీ వైద్యాఽధికారి వాసంతి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్
లింగరాజుపాలెం హైస్కూల్లో
ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ