
నర్సీపట్నంలో ఈదురుగాలుల బీభత్సం
నర్సీపట్నం : పట్టణంలో సోమవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని మెయిన్‌రోడ్‌తో పాటు వీధులన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. గచ్చపు వీధి, తదితర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఆర్డీవో కార్యాలయం, పాత మున్సిపల్ కార్యాలయ ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. రాకపోకలకు అంతరాయం లేకుండా నేలకూలిన చెట్లను ఫైర్ సిబ్బంది తొలగించారు. అయినప్పటికీ రాత్రి 8 గంటల వరకు విద్యుత్ లేక చీకట్లు అలముకోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
విరిగిన స్తంభాలు, నేలకూలిన చెట్లు

నర్సీపట్నంలో ఈదురుగాలుల బీభత్సం

నర్సీపట్నంలో ఈదురుగాలుల బీభత్సం