
జిల్లా వాలీబాల్ బాలికల జట్టు ఎంపిక
అనకాపల్లి : ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో స్థానిక గవరపాలెం జీవీఎంసీ చిన్న హైస్కూల్లో శాప్ వాలీబాల్ బాలికల జట్టు ఎంపిక కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారి ఎల్.వి.రమణ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి 14 మంది బాలికలు హాజరయ్యారని, జిల్లా జట్టుగా 12 మంది క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. విశాఖలో ఈనెల 16 నుంచి 20 వరకు జరుగు జోనల్ పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటారని, అక్కడ గెలుపొందిన జట్టు ఈనెల 21 నుంచి 25 వరకు విజయవాడలో జరుగు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ జట్లకు కోచ్ కం మేనేజర్లుగా జాతీయ వాలీబాల్ రిఫరి భీశెట్టి శ్రీనివాసరావు, విల్లూరి ప్రసాద్ వ్యవహరిస్తారు. కార్యక్రమంలో సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు ఎల్లపు గోవింద, రాపేటి సీతారాం, దాడి ఓం శివ, పీలా రమణారావు, బుద్ధ శివ, కె.ఆర్.కె సత్యనారాయణ పాల్గొన్నారు.