
కూటమి నాయకుల విధ్వంసంపై ఫిర్యాదు
తుమ్మపాల : మండలంలో బట్లపూడి పంచాయతీ రాయుడుపేటలో సామాజిక భవనం మెట్లను ఆదివారం మధ్యాహ్నం కూటమి నాయకులు యంత్రాలతో ధ్వంసం చేసినట్టు గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో సామాజిక అవసరాల కోసం 2003లో మండల పరిషత్ నిధులతో చేపట్టిన సామాజిక భవనాన్ని కూటమి నాయకులు నిబంధనలు పాటించకుండా ధ్వంసం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ సెలవు దినం నాడు మెట్లను ధ్వంసం చేసి సామాజిక భవనం కూల్చేందుకు ప్రయత్నించడంపై అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.