
● ఇప్పటికే చాలా రూట్లలో బస్సు సర్వీసుల కొరత ● పలు బస్సు
రాష్ట్ర ప్రభుత్వం సీ్త్రశక్తి పథకం అమలు గురించి ఆర్భాటంగా ప్రచారం చేసింది. ఆచరణలో మాత్రం శూన్యం కనపడుతుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఉద్దేశించిన ఈ పథకం ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీనికోసం డీఎం నుంచి సీఎం వరకు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. సన్నద్ధం అంటూ సన్నాహాక సమావేశాలు పెడుతున్నారు. వాస్తవంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. చాలినన్ని బస్సులు లేవు. కొత్త బస్సుల ఊసే లేదు. దీంతో ఈ పథకం ప్రయాణికులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టనుందన్న వాదన వినిపిస్తోంది.
నర్సీపట్నం :
అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నంలలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ రెండు డిపోల్లో మొత్తం అన్ని రకాల బస్సులు 204 వరకు ఉన్నాయి. ఈ బస్సులు ప్రస్తుతం జిల్లా ప్రజల రవాణా అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ప్రస్తుతం బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు 70 శాతంగా ఉంది. రద్దీ వేళల్లో ఆక్యుపెన్సీ వంద శాతం మించిపోతుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నర్సీపట్నం, అనకాపల్లి, పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం తదితర పట్టణాలకు చదువుకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ రూట్‌ల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు ఎక్కలేని పరిస్థితి ఉంది. నిత్యం ఎక్కడో ఒక దగ్గర విద్యార్థులు బస్సుల కోసం ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. సీ్త్రశక్తి పథకం ప్రారంభమైతే ప్రస్తుతం ఉన్న ఆక్యుపెన్సీ రేటు మరింత పెరగనుంది. ఈ పెరుగుదలకు అనుగుణంగా బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. కొత్తగా ఒక్క బస్సును కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే కాలం చెల్లిన బస్సులతోనే ఈ పథకాన్ని నడిపించాలని చూస్తున్నారు. నర్సీపట్నం డిపోలో 106 బస్సులు ఉండగా 93 బస్సులు తిరుగుతున్నాయి. మిగిలిన బస్సులు బ్రేక్ డౌన్‌లో ఉన్నాయి. బ్రేక్ డౌన్‌లో బస్సులను కూడా రోడ్ల మీదకు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి బస్సును విరామం లేకుండా తిప్పాలని చూస్తున్నారు. అంతే తప్ప కొత్త బస్సులు ఊసులేదు. ఇప్పటికే అరకొర బస్సులతో ఆగచాట్లు పడుతున్న విద్యార్థులు ఉచిత ప్రయాణంతో తాము మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
లేని బస్సులకు ఉచితం..
ప్రభుత్వం పాసింజర్లతో పాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణం ఉచితం అని ప్రకటించింది. అయితే ఈ ఎక్స్‌ప్రెస్ బస్సులు అరకొరగా మాత్రమే ఉన్నాయి. నర్సీపట్నం డిపోలో 12 ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం, చింతపల్లి రూట్‌ల్లో మాత్రమే తిరుగుతాయి. అనకాపల్లి డిపోలో 4 మాత్రమే ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మిగతా డిపోల్లో కూడా ఎక్స్‌ప్రెస్ బస్సుల సంఖ్య చాలా పరిమితం. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు. ఎక్స్‌ప్రెస్ వరకే కాకుండా సూపర్ లగ్జరీ, అల్ట్రాడీలక్స్ బస్సులకు కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుందని మహిళలు కోరుతున్నారు.

● ఇప్పటికే చాలా రూట్లలో బస్సు సర్వీసుల కొరత ● పలు బస్సు

● ఇప్పటికే చాలా రూట్లలో బస్సు సర్వీసుల కొరత ● పలు బస్సు