విద్యుత్‌ లోడు క్రమబద్ధీకరణకు రాయితీ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ లోడు క్రమబద్ధీకరణకు రాయితీ

Aug 12 2025 7:57 AM | Updated on Aug 12 2025 12:52 PM

విద్యుత్‌ లోడు క్రమబద్ధీకరణకు రాయితీ

విద్యుత్‌ లోడు క్రమబద్ధీకరణకు రాయితీ

అనకాపల్లి : గృహాల్లో అదనపు విద్యుత్‌లోడ్‌ను క్రమబద్దీకరణకు ఈ ఏడాది డిశంబర్‌ 31వ తేదీ వరకూ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్‌ విద్యుత్‌ వినియోగదారులకు అవకాశం కల్పించిందని ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ జి. ప్రసాద్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గృహాల్లో అదనపు విద్యుత్‌లోడ్‌ను వినియోగించుకుని విద్యుత్‌ వినియోగదారులు ఈ ఏడాది మార్చి 1 నుంచి జూన్‌ 30వ తేదీ వరకూ స్వచ్ఛందంగా 7010 మంది వినియోగదారులు 50శాతం రాయితీని వినియోగించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

50శాతం రాయితీతో కిలోవాట్‌ను గృహ వినియోగదారులు తగ్గించుకోవచ్చని ఎస్‌ఈ ప్రసాద్‌ చెప్పారు.

అదపులోడ్‌ అసలు ధర తగ్గింపు ధర

1కిలో వాట్‌ 2250 1250

2కిలో వాట్‌ 4450 2450

3కిలో వాట్‌ 6650 3650

4కిలో వాట్‌ 8850 4850

5కిలో వాట్‌ 11050 6050

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement