
నేడు డీవార్మింగ్ మాత్రల పంపిణీ
అనకాపల్లి: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ఈనెల 12న నిర్వహిస్తున్నట్టు డీఎంఅండ్‌హెచ్‌వో ఎం.హైమావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్ని అంగన్‌వాడీ, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన విద్యార్థులకు ఉచితంగా నులిపురుగుల నివారణ మాత్రలు వేయడం జరుగుతుందన్నారు. నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, 1 సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వయసు గల పిల్లలకు సగం మాత్రను నీటిలో కరిగించి తాగించాలని, రెండు నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులకు మాత్రను మధ్యాహ్నం భోజనం చేసిన అరగంట తరువాత చప్పరించేటట్లు వేయడం జరుగుతుందన్నారు.