
హోరా హోరీగా ఖోఖో పోటీలు
పాయకరావుపేట : శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల్లో ఈ నెల 9వ తేదీ నుండి 11 వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న అండర్ –14,17,19 బాలుర, బాలికల విభాగంలో జరుగుతున్న సీబీఎస్‌ఈ క్లస్టర్ –7 అంతరాష్ట్ర ఖోఖో పోటీలకు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల నుంచి 180 కి పైగా జట్లు , సుమారు 2000 మంది విద్యార్ధులు పాల్గొన్న ఈ పోటీలు నువ్వా నేనా అన్నట్లు హోరా హోరీగా సాగుతున్నాయి. ఇప్పటివరకూ అండర్ – 19 బాలికల విభాగంలో ప్రథమ స్ధానం సిస్టర్ నివేదిత స్కూల్, హైదరాబాద్, ద్వితీయ స్థానం వెరిటాస్ సైనిక్ స్కూల్ తిరుపతి, తృతీయ స్ధానాన్ని సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ఏలూరు, హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్, ఖమ్మం గెలుచుకున్నారు. మిగిలిన విభాగాల్లో జట్లు పోటీల్లో తమ సత్తా చాటి క్వార్టర్ ఫైనల్స్ దిశగా దూసుకు వెళ్తున్నారు. విజేతలకు సోమవారం జరిగే ముగింపు కార్యక్రమంలో బహుమతి ప్రదానం జరుగుతుంది. కార్యక్రమంలో సీబీఎస్‌ఈ పరిశీలకులు సిహెచ్‌ఎల్‌ఎం శ్రీనివాస్, విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ, ఆంధ్రా, తెలంగాణా నుంచి పోటీలకు హాజరైన విద్యార్ధులు, కోచ్‌లు మేనేజర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

హోరా హోరీగా ఖోఖో పోటీలు