
లారీని ఢీకొట్టి దెబ్బతిన్న కారు..
కశింకోట : కశింకోట వద్ద జాతీయ రహదారిపై అదృష్ట్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు ప్రమాదం నుంచి సురక్షితంగా త్రుటిలో బయటపడ్డారు. అనకాపల్లి నుంచి ఎలమంచిలి వైపు వెళుతున్న కారు కశింకోట పోలీస్‌స్టేషన్ వద్దకు చేరేసరికి ముందు వెళుతున్న లారీని తప్పించుకొని ముందుకు వెళ్లడానికి డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో లారీని కారు పక్కగా ఢీకొంది. దీంతో కారు వెనక చక్రం, పక్క భాగం దెబ్బతిన్నాయి. అయితే ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒకే కుటుంబం డ్రైవర్, భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ బయటపడ్డారు. ఈ ప్రమాదం వల్ల వాహనాల రాకపోకలకు కొంత సేపు అంతరాయం కలిగింది . ప్రమాదానికి గురైన కారును పక్కకు తొలగించి, పోలీసులు ట్రాఫిక్ నియంత్రించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
కారులో ప్రయాణికులకు తృటిలో తప్పిన ప్రమాదం

లారీని ఢీకొట్టి దెబ్బతిన్న కారు..