సమర్థ న్యాయవాదులు అవసరం | - | Sakshi
Sakshi News home page

సమర్థ న్యాయవాదులు అవసరం

Aug 11 2025 6:40 AM | Updated on Aug 11 2025 6:40 AM

సమర్థ న్యాయవాదులు అవసరం

సమర్థ న్యాయవాదులు అవసరం

విశాఖ లీగల్‌: న్యాయ వ్యవస్థ బలోపేతం కావడానికి సమర్థవంతమైన న్యాయవాదులు అవసరమని గుజరాత్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ అన్నారు. స్వయంకృషి, సత్సంకల్పం మనిషి ఎదుగుదలకు మూలస్తంభాలని వ్యాఖ్యానించారు. జిల్లా కోర్టు నూతన భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఆదివారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దివంగత న్యాయవాది ఎం.సత్యనారాయణ చిత్రపటాన్ని జస్టిస్‌ రాయ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యనారాయణ బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించారని గుర్తుచేసుకున్నారు. సహచర న్యాయవాదులు, న్యాయమూర్తులతో ఆయన కేసులను వివరించే తీరు, ప్రవర్తన నేటి యువ న్యాయవాదులకు ఆదర్శం కావాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు మాట్లాడుతూ దిగువ స్థాయి నుంచి ఎదిగి, మంచి ప్రతిభతో, స్ఫూర్తితో ఎందరో న్యాయవాదులకు సత్యనారాయణ మార్గదర్శకంగా నిలిచారన్నారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ కోర్టుల్లో సత్యనారాయణ వ్యవహరించిన తీరు తమకు ఎంతో నేర్పిందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌.కృష్ణమోహన్‌, సభ్యుడు పి.నర్సింగరావు, న్యాయవాదుల సంఘం కార్యదర్శి ఎల్‌.పి.నాయుడు, ప్రముఖులు పైలా సన్నీబాబు, నమ్మి సన్యాసిరావు, సత్యనారాయణ కుమారుడు, న్యాయవాది అనిల్‌ కుమార్‌, రాచకొండ ఉమా శాస్త్రి, జి.ఎం.రెడ్డి, చీమలపాటి శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement