
పలు రైళ్లకు ఆయాస్టేషన్లలో హాల్ట్‌లు
తాటిచెట్లపాలెం: ఆయా ప్రాంతాల ప్రయాణికులు, ప్రజల అవసరాలకు తగినట్లుగా పలు రైళ్లకు ప్రయోగాత్మకంగా హాల్ట్‌లను ఇచ్చేందుకు రైల్వే బోర్డు నిర్ణయించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు.
● విశాఖపట్నం–కోర్బా–విశాఖపట్నం(18518/ 18517) ఎక్స్‌ప్రెస్‌కు ఈనెల 15వ తేదీ నుంచి ఇరువైపులా మురిబహల్ స్టేషన్లో హాల్ట్ కల్పించారు.
● ధన్‌బాద్–అలెప్పి–ధన్‌బాద్(13351/13352) బొకారో ఎక్స్‌ప్రెస్‌కు ఈనెల 15వ తేదీ నుంచి ఇరువైపులా అంబోడల, తెరుబలి స్టేసన్‌లో హాల్ట్ కల్పిస్తున్నారు.
● బిలాస్‌పూర్–తిరుపతి–బిలాస్‌పూర్(17481/ 17482) ఎక్స్‌ప్రెస్‌కు ఈనెల 15వ తేదీ నుంచి ఇరువైపులా అంబోడల, తెరుబలి స్టేషన్‌ల్లో హాల్ట్ కల్పిస్తున్నారు.
● హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం(12808) సమతా ఎక్స్‌ప్రెస్‌కు ఈనెల 15వ తేదీ నుంచి, తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్(12807) సమతా ఎక్స్‌ప్రెస్‌కు ఈనెల 16వ తేదీ నుంచి తెరుబలి స్టేషన్‌లో హాల్ట్ కల్పిస్తున్నారు.
● అమృత్‌సర్–విశాఖపట్నం–అమృత్‌సర్(20808 /20807) హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌కు ఈనెల 15వ తేదీ నుంచి ఇరువైపులా నరాజ్ మార్తాపూర్ స్టేషన్‌లో హాల్ట్ కల్పిస్తున్నారు.