
ఘనంగా దేవీతల్లి ఆలయ పునః ప్రారంభోత్సవం
మునగపాక: మండలంలోని ఉమ్మలాడలోని దేవీతల్లి ఆలయ పునఃప్రారంభోత్సవంలో భాగంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత,మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ,ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్,మాజీ ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు,వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ తదితరులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ పల్లె అప్పలనాయుడు,ఎంపీటీసీ మొల్లేటి కృష్ణవేణి, మొల్లేటి నారాయణరావు,శంకర్.కరోతి విజయకుమార్,ఆటో శ్రీను,నరసింగరావు,గణేష్, మొల్లేటి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.కాగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనకు భక్తులు భారీగా తరలివచ్చారు.