
సీఎం పర్యటనకు తాటిపర్తిలో హెలిప్యాడ్ ఏర్పాటు
భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా
మాడుగుల: పాడేరులో శనివారం ఆదివాసీ దినోత్సవంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం మాడుగుల మండలం తాటిపర్తిలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు ఎస్పీ సూచనలు చేశారు. ఆర్డీవో వి.వి.రమణ, అదనపు ఎస్పీ ఎం.దేవిప్రసాద్, డీఎస్పీలు ఎం. శ్రావణి, పి.నాగేశ్వరరావు కె.కోటపాడు సీఐ పైడిపునాయుడు, ఎస్‌ఐ నారాయణరావు పాల్గొన్నారు.