● కలగా మిగిలిపోతున్న గిరిజనుల ఆశలు ● కలెక్టర్లు కళ్లారా చూసినా తీరని కష్టాలు ● స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లినా స్పందన శూన్యం ● గిరిజనుల సమస్యలపై నిర్లక్ష్య ధోరణిలో కూటమి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

● కలగా మిగిలిపోతున్న గిరిజనుల ఆశలు ● కలెక్టర్లు కళ్లారా చూసినా తీరని కష్టాలు ● స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లినా స్పందన శూన్యం ● గిరిజనుల సమస్యలపై నిర్లక్ష్య ధోరణిలో కూటమి ప్రభుత్వం

Aug 9 2025 5:04 AM | Updated on Aug 9 2025 5:04 AM

● కలగ

● కలగా మిగిలిపోతున్న గిరిజనుల ఆశలు ● కలెక్టర్లు కళ్లారా

నాతవరం:

రుగుడు, సుందరకోట.. నాతవరం మండలంలోని అత్యంత క్లిష్టమైన గిరిజన పంచాయతీలు.. ఇవి 1/70 యాక్టు పరిధిలో ఉన్నాయి. ఈ రెండు పంచాయతీల పరిధిలో అసనగిరి, రామన్నపాలెం, ముంతమామిడిలొద్దు, తోరడ, దద్దుగుల, రాజవరం, మాసంపల్లి, అచ్చంపేట, యరకంపేట, శిరిపురం, బమ్మిడికలొద్దు, కొత్త దద్దుగుల, కొత్త లంకలు, పాత శిరిపురం శివారు గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో గిరిజనులంతా గ్యాప్‌ ఏరియా భూముల్లో తుప్పలు, డొంకలను తొలగించి వ్యవసాయం సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. కొండల మీద ఉన్న భూములను బ్రిటిష్‌ హయాంలో సైతం సర్వే చేయకపోవడంతో సుమారు 10 వేల ఎకరాలను గ్యాప్‌ ఏరియా భూములుగా పరిగణిస్తున్నారు. అవి రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో గిరిజనులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేవీ వారికి అందడం లేదు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను సర్వే చేసి అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలని ఏళ్ల తరబడి కలెక్టర్లకు విజ్ఞప్తి చేసుకుంటున్నా ఫలితం లేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ కాలంలో కొందరికి పట్టాలు వచ్చాయి. మిగతా వారికి పంపిణీ చేసే లోగా కూటమి ప్రభుత్వం వచ్చి ఆ ప్రక్రియను నిలిపివేసింది. గిరిజనుల విజ్ఞప్తి మేరకు 2006 నుంచి అనేక మంది కలెక్టర్లు ఈ గిరిజన గ్రామాలను సందర్శించారు. ప్రస్తుత కలెక్టర్‌ విజయ కృష్ణన్‌, అంతకుముందు కలెక్టర్‌గా పనిచేసిన రవి పట్టాన్‌శెట్టి కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. వారి ఆదేశాలతో గ్యాప్‌ ఏరియా భూములను సర్వే చేసేందుకు చర్యలు చేపట్టారు. రెండు జిల్లాల సరిహద్దులో గల గ్యాప్‌ ఏరియా భూములు ఎంతవరకు ఉన్నాయనేది హద్దులు నిర్ణయించారు. కానీ ఈ ప్రక్రియను పూర్తి చేసి గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను నిర్ధారించే విషయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు.

అందని ఐటీడీఏ సదుపాయాలు

పాడేరు ఐటీడీఏ ద్వారా కల్పించే సదుపాయాలు మైదాన ప్రాంతంలో గిరిజనులకు అందడం లేదు. గతంలో పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో గిరిజనులకు అందిస్తున్న రాయితీలు, సదుపాయాలను కల్పించేవారు. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం మైదాన ప్రాంత గిరిజనులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. గిరిజన ప్రాంతంలో అధికంగా సర్పంచులు, ఎంపీటీసీలు ఇతర ప్రజా ప్రతినిధులు వైఎస్సార్‌సీపీకి చెందిన వారు ఉండటంతో కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను పాడేరు ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేసేవారు. ఇటీవల కాలంలో పూర్తిగా వదిలేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మైదాన ప్రాంత గిరిజనులను పట్టించుకోవడం మానేశారు.

వైఎస్సార్‌ సీపీ హయాంలోనే గిరిజనులకు మేలు

సరుగుడు, సుందరకోట పంచాయతీల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు అందజేసి, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో పెట్టుబడి సాయం అందించేది. ఈ రెండు పంచాయతీల్లో అర్హత ఉన్న 550 మందికి రైతు భరోసా పథకంలో డబ్బులు అందచేశారు. సర్వే చేసి ఇంకా 350 మందికి పైగా హక్కు పత్రాలు ఇవ్వడానికి సిద్ధం చేయగా ఈలోగా ఎన్నికల కోడ్‌ వచ్చి ప్రక్రియ నిలిచిపోయింది.

వాటిని నేటికీ ఇవ్వకపోవడంతో గత ఏడాది గ్రామంలో పర్యటనకు వచ్చిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి స్పందన కానరాలేదు.

గిరిజనులకు తీరని అన్యాయం

రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పాడేరు ఐటీడీఏ ద్వారా గిరిజనులకు ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితీలు మైదాన ప్రాంతంలో ఉండే మాకు కూడా వర్తింపజేసేవారు. మాకు ఇప్పుడు ఎలాంటి సాయం అందడం లేదు.

–బండి గంగరాజు, గిరిమిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ, సరుగుడు

ఇంకెవ్వరికి బాధలు చెప్పుకోవాలి

మా గిరిజన గ్రామాల్లో ప్రధాన సమస్యలను స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్‌ విజయ కృష్ణన్‌లకు తెలియజేశాం. గత ప్రభుత్వంలో మధ్యలో నిలిచిపోయిన అటవీ హక్కు పత్రాల పంపిణీని పూర్తి చేయమని స్పీకర్‌ను కోరాం. అయినా ఇంతవరకు గ్యాప్‌ ఏరియా సమస్య పరిష్కారం కాలేదు.

– సాగిన లక్ష్మణమూర్తి,

ఎంపీపీ, సరుగుడు

గ్యాప్‌ ఏరియా..

విముక్తి లేదయా..!

అసలే వెనుకబడ్డ గిరిజన ప్రాంతంలో ఈ అడవి బిడ్డల దుస్థితి మరింత జటిలమైన సమస్య.. కలెక్టర్లు వస్తున్నారు, వెళుతున్నారు, పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వంటి నాయకులెందరికో గిరిజనులు తమ గోడు వినిపించారు.. గానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. గ్యాప్‌ ఏరియా భూముల సమస్య అలాగే ఉంది.

● కలగా మిగిలిపోతున్న గిరిజనుల ఆశలు ● కలెక్టర్లు కళ్లారా1
1/5

● కలగా మిగిలిపోతున్న గిరిజనుల ఆశలు ● కలెక్టర్లు కళ్లారా

● కలగా మిగిలిపోతున్న గిరిజనుల ఆశలు ● కలెక్టర్లు కళ్లారా2
2/5

● కలగా మిగిలిపోతున్న గిరిజనుల ఆశలు ● కలెక్టర్లు కళ్లారా

● కలగా మిగిలిపోతున్న గిరిజనుల ఆశలు ● కలెక్టర్లు కళ్లారా3
3/5

● కలగా మిగిలిపోతున్న గిరిజనుల ఆశలు ● కలెక్టర్లు కళ్లారా

● కలగా మిగిలిపోతున్న గిరిజనుల ఆశలు ● కలెక్టర్లు కళ్లారా4
4/5

● కలగా మిగిలిపోతున్న గిరిజనుల ఆశలు ● కలెక్టర్లు కళ్లారా

● కలగా మిగిలిపోతున్న గిరిజనుల ఆశలు ● కలెక్టర్లు కళ్లారా5
5/5

● కలగా మిగిలిపోతున్న గిరిజనుల ఆశలు ● కలెక్టర్లు కళ్లారా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement