
రాష్ట్రస్థాయి పోటీలకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థి
నర్సీపట్నం: రాష్ట్ర స్థాయి పోటీలకు నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపికయ్యాడు. కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ (సీసీఈ) ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టం మీద వివిధ పోటీలను నిర్వహించారు. కళాశాల స్థాయిలో నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో కళాశాలలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి పి.విజయ్‌కుమార్ ప్రథమస్థానంలో నిలిచాడు. ఈ నెల 6న విశాఖపట్నం డాక్టర్ వి.ఎస్.కృష్ణ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జోనల్ స్థాయి పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచాడు. ఈ నెల 11న విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, అధ్యాపకులు అభినందించారు.