
పని దొరికింది.. హ్యాపీ అన్నాడు..
ప్రమీలా పని దొరికింది. ఇంత కాలం ఖాళీగానే ఉన్నా. ఇక మనకు పర్వాలేదు. పిల్లలకు హ్యాపీ అంటూ వెళ్లిన తన భర్త, పేలుడు ఘటనలో గాయపడి చికిత్స పొందుతూ మరణించడంతో.. గుర్తు చేసుకుని వెక్కివెక్కి ఏడుస్తున్న చింతకాయల ముత్యాలు భార్య ప్రమీల కేజీహెచ్ మార్చురీ వద్ద ఉన్నవారిని కంటతడి పెట్టించింది. అర్ధంతరంగా వదిలి వెళ్లిపోయావు నాయనా.. పిల్లల్ని ఎవరు చూస్తారంటూ ప్రమీల తల్లి(ముత్యాలు అత్త) వేదన అంతా ఇంతా కాదు. పోస్టుమార్టం కోసం మార్చురీకి తీసుకెళ్తుండగా ముత్యాలు మృతదేహాన్ని చూసి ప్రమీల సొమ్మసిల్లిపోయింది. వీరు ఇద్దరు పిల్లలతో బుక్కావీధిలో ఉంటున్నారు.