దక్కని గౌరవం.. అందని వేతనం.! | - | Sakshi
Sakshi News home page

దక్కని గౌరవం.. అందని వేతనం.!

Aug 8 2025 7:32 AM | Updated on Aug 8 2025 7:32 AM

దక్కని గౌరవం.. అందని వేతనం.!

దక్కని గౌరవం.. అందని వేతనం.!

● ఎంపీటీసీ సభ్యులపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు ● 16 నెలలుగా విడుదల కాని గౌరవ వేతనం నిధులు ● అత్యధిక శాతం వైఎస్సార్‌సీపీ సభ్యులు కావడంతో నిర్లక్ష్యం ● ప్రొటోకాల్‌కు మంగళం పాడేసిన అధికారులు ● గ్రామాల్లో కూటమి నేతలకే పెత్తనం ● ఉమ్మడి విశాఖ జిల్లాలో 651 మంది ఎంపీటీసీలు

సాక్షి, అనకాపల్లి/కోటవురట్ల :

ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు వారంతా. పరిపాలనాపరమైన అంశాలలో వారి ఆమోదం తప్పనిసరి. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొనాల్సిన వారిని కూటమి ప్రభుత్వం కరివేపాకులా తీసి పడేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రజాస్వామ్యానికే అర్థం మారిపోయింది. ఎంపీటీసీలను పక్కన పెట్టి.. ఏ సంబంధం లేని కూటమి నాయకులు అధికారిక కార్యక్రమాలను అంతా తామై నడిపిస్తున్నారు. అధికారులు సైతం వారికి వత్తాసు పలికి ప్రొటోకాల్‌కు పూర్తిగా మంగళం పాడేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను కాస్త టీడీపీ, జనసేన పార్టీ కార్యక్రమాల్లాగా నిర్వహిస్తున్నారు. పోనీ ఎంపీటీసీ సభ్యుడిగా గుర్తింపు దక్కలేదు.. కనీసం వారికి వచ్చే గౌరవ వేతనం కూడా 16 నెలలుగా ఇవ్వడం లేదు. దీనికి కారణం గత స్థానిక ఎన్నికల్లో 90 శాతానికి పైగా స్థానాలు వైఎస్సార్‌సీపీకి దక్కడమే. అందుకే కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి అవమానిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.

గౌరవ వేతనానికీ దిక్కులేదు..

కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంపీటీసీ సభ్యులకు గౌరవం ఇవ్వక పోగా.. వారికి ఇచ్చే గౌరవ వేతనం కూడా అందని పరిస్థితి నెలకొంది. ఎంపీటీసీ సభ్యులకు నెలకు రూ.3 వేల చొప్పున గౌరవ వేతనంగా అందివ్వాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం జూన్‌ 12న పగ్గాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 జూలై నుంచి అక్టోబర్‌ వరకు నాలుగు నెలలకు మాత్రమే ఎంపీటీసీ సభ్యులకు గౌరవం వేతనం చెల్లించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో 2023 డిసెంబర్‌ వరకూ రెండు విడతలుగా గౌరవ వేతనాన్ని చెల్లించారు. మూడో విడత నిధులు విడుదల చేసేందుకు 2024లో బిల్లు పెట్టి చర్యలు తీసుకునే సమయంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో వేతనాల చెల్లింపునకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి నేటి వరకు ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనాల బకాయిలు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.

ఉమ్మడి విశాఖలో ఇదీ పరిస్థితి

ఉమ్మడి విశాఖ జిల్లాలో 651 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వీరిలో 405 ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్‌సీపీకి చెందిన వారే. ప్రభుత్వ కార్యక్రమాల్లో వీరికి చోటు కల్పించకుండా కూటమి నాయకులతో పని కానిచ్చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement