
భవన నిర్మాణ కార్మికుల జిల్లా కమిటీ ఎన్నిక
రాంబిల్లి(అచ్యుతాపురం): భవన నిర్మాణ కార్మి కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కె.రామకృష్ణ(నర్సీపట్నం) ఎన్నికయ్యారు. రాంబిల్లిలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల మహాసభల్లో నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా అడిగర్ల రాజు, ఉపాధ్యక్షులుగా పి.చిరంజీవి(పరవాడ), డి.శివ(నర్సీపట్నం), సహాయ కార్యదర్శిగా అప్పలనాయుడు(సబ్బవరం), కోశాధికారిగా జి.అప్పారావుతో పాటు 9 మందితో కూడిన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాడతామన్నారు.