
నాలుగు పీఏసీఎస్‌లకు ఉత్తమ అవార్డులు
నాతవరం/తుమ్మపాల/రావికమతం/కోటవురట్ల : ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం ఆరు, అనకాపల్లి జిల్లాలో నాలుగు ప్రాథమిక సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్) రాష్ట్ర స్థాయిలో సేవలకు అవార్డు పొందాయి. రాష్ట్ర సహకార సంఘం స్థాపించి 62వ సంవత్సరం పురస్కరించుకుని ఉత్తమ సహకార సంఘాల పురస్కార కార్యక్రమం ఈ నెల 4న విజయవాడలో జరిగింది.. వ్యవసాయ రైతులకు సకాలంలో రుణాలు అందించడంతో పాటు వ్యాపారాభివృద్ది చేసి లాభాలు సాధించడంతో ఈ అవార్డులు పొందాయి. 2024–25 ఆర్ధిక సంవత్సరానికి నాతవరం పీఏసీఎస్, తుమ్మపాల మండలం చింతనిప్పుల అగ్రహారం పీఏసీఎస్, 2023–2024వ సంవత్సరానికి రావికమతం మండలం కొత్తకోట సహకార సంఘం, కోటవురట్ల సహకారం సంఘం ఉత్తమ సేవా అవార్డులు పొందాయి.
విజయవాడ ఎన్టీఆర్ సహకార భవనంలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఆప్కాబ్ చైర్మన్ వీరనారాయణ చేతుల మీదుగా నాతవరం పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి అపిరెడ్డి మాణిక్యం, సీఈవో ఆదినారాయణ, చింతనిప్పుల అగ్రహారం పీఏసీఎస్ సీఈవో మధుసూధనరావు, కొత్తకోట సహకార సంఘం సీఈవో గుర్రాల రఘు, కోటవురట్ల పీఏసీఎస్ సంఘం పర్సన్ ఇన్‌చార్జ్ వేచలపు జనార్ధన్ రూ.20వేలు నగదుతో పాటు షీల్డు అందుకున్నారు.

నాలుగు పీఏసీఎస్‌లకు ఉత్తమ అవార్డులు

నాలుగు పీఏసీఎస్‌లకు ఉత్తమ అవార్డులు

నాలుగు పీఏసీఎస్‌లకు ఉత్తమ అవార్డులు