
చోరీ కేసులో యువకుడి అరెస్ట్
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అచ్యుతాపురం రూరల్ : మార్టూరు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన సెల్‌ఫోన్ దొంగతనం కేసులో చందక గోపి అనే యువకుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు. గోపీ అర్ధరాత్రి సమయంలో గడియ విరగ్గొట్టి ఇంటిలో చొరబడి బెడ్ రూమ్‌లో పడుకున్న వ్యక్తుల నుంచి ఆరు సెల్‌ఫోన్లు, రూ.5 వేలు నగదు దొంగిలించారు. ఈ మేరకు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.