
108 వాహనంలో ప్రసవం
108 వాహనంలో జన్మించిన బిడ్డతో సిబ్బంది
దేవరాపల్లి: వాలాబు పంచాయతీ రామన్నపాలేనికి చెందిన గర్భిణి గిమ్మెల లక్ష్మి 108 వాహనంలో ప్రసవించింది. ఆమెకు మంగళవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో దేవరాపల్లి పీహెచ్‌సీకి తీసుకెళ్లగా అక్కడ తనిఖీ చేసిన వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవల కోసం కె.కోటపాడు కమ్యూనిటీ ఆస్పత్రికి పంపించారు. 108లో తీసుకువెళుతుండగా ఎ.కోడూరు సమీపంలోకి రాగానే ఒక్కసారి నొప్పులు అధికమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన 108 సిబ్బంది వైద్య సేవలందించగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. సుఖ ప్రసవం చేసిన 108 సిబ్బందిని పలువురు అభినందించారు.