
త్వరితగతిన బంగారు కుటుంబాలకు మ్యాపింగ్
● కలెక్టర్ విజయ కృష్ణన్
మ్యాపింగ్‌పై అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: బంగారు కుటుంబాలను మ్యాపింగ్ చేయడానికి అవసరమైన మార్గదర్శుల ఎంపిక త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర జీరో పోవర్టి –పీ4 మ్యాపింగ్‌పై సీఎం నారా చంద్రబాబునాయుడు మంగళవారం అమరావతి నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఇప్పటివరకు ఎంపిక చేయబడిన మార్గదర్శులను బంగారు కుటుంబాలకు మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ నెల 15వ తేదీకి లక్ష్యం సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళికా అధికారి బి. రామారావు, తదితరులు పాల్గొన్నారు.